Sunday, January 19, 2025

మేడ్చల్ జూవెల్లరీ షాపు దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జూవెల్లరీ షాపు రాబరీ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి బైక్, బురఖా, గ్లౌస్, బ్యాగు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిని విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నజీం అజిజ్ కొటాడియా నగరం ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు, నిందితుడికి భార్య, కుమారుడు ఉన్నారు. షేక్ సోహైల్ స్క్రాప్ వ్యాపారం చేస్తున్నాడు, సల్మాన్ పరారీలో ఉన్నాడు. నజీం అజీజ్ ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి కాగానే ఆఫ్రికా, చైనాలో చదువుకున్నాడు, తర్వాత అమెరికాలో ఉద్యోగం చేశాడు. నజీం తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొంపల్లిలో ఉంటున్నాడు. వ్యాపారం చేయడంతో నష్టాలు వచ్చాయి, దీంతో వ్యాపారాన్ని మూసివేసి ర్యాపిడోలో డ్రైవింగ్ చేస్తున్నాడు. మరో రెండు బైక్‌లను కొనుగోలు చేసి వాటిపై డ్రైవర్లను నియమించి ర్యాపిడోలో నడిపిస్తున్నాడు.

ఇలా చేస్తున్నా కుటుంబ అవసరాలకు సరిపడా డబ్బులు రాకపోవడంతో చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూవెల్లరీ షాపులో చోరీ చేసేందుకు రెక్కీ నిర్వహించాడు. తర్వాత కత్తి చూపించి చోరీ చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నజీం అజీజ్‌ను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు. జైలులో సోహైల్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు జైలులోనే స్నేహితులుగా మారారు, ఇద్దరు కలిసి సల్మాన్‌తో కలిసి చోరీ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు జూవెల్లరీషాపుల్లో దోపిడీ చేసేందుకు రెక్కీ నిర్వహించారు. మేడ్చల్‌లోని చోరీ చేయాలని ప్లాన్ వేశారు. ఈనెల 17వ తేదీన కొట్టేసిన బైక్‌పై షేక్ సోహైల్, నజీం అజీజ్ హబ్సీగూడలో పల్సర్ బైక్‌ను చోరీ చేశారు, తర్వాత బురఖా, కత్తిని కొనుగోలు చేశారు. తర్వాత జూవెల్లరీ షాపులో రాబరీకి యత్నం చేయడంతో యజమాని అడ్డుకోవడంలో నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. మేడ్చల్, దుండిగల్, సిసిఎస్ మేడ్చల్, బాలానగర్, మేడ్చల్ ఎస్‌ఓటి, బాలానగర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు.

24గంటల్లో పట్టివేత…
జూవెల్లరీ షాపులో రాబరీకి యత్నం జరగడంతో ఒక్కసారిగా సంఛలనం సృష్టించింది. వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పోలీస్ బృందాలను రంగంలోకి దింపి నిందితుల కోసం వేటమొదలు పెట్టారు. దాదాపుగా పోలీసులు 161 సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్‌లో నిందితులు ఆటోలో ఎక్కుతుండగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను వెతికేందుకు 16టీములను రంగంలోకి దింపి పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News