Saturday, January 11, 2025

కూకట్‌పల్లిలో ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుడి రూమ్‌లో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. శ్యామ్, జ్యోతి అనే యువతి యువకులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు భీమవరానికి ప్రాంతం గొల్లవాని తిప్ప గ్రామానికి చెందిన శ్యామ్, జ్యోతిగా గుర్తించారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. రూమ్ లో నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News