Friday, December 20, 2024

కూకట్ పల్లిలో దారుణం… బాలుడిపై లైంగిక దాడి?

- Advertisement -
- Advertisement -

కూకట్ పల్లి: మల్కాజ్ గిరి జిల్లా కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వివేకానంద నగర్ లో ఓ బాలుడిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చి బెంగాల్ రాష్ట్రం కలకత్తాకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబం కలిసి కూకట్ పల్లిలోని వివేకానం నగర్ లో ఉంటున్నాడు. సదరు వ్యక్తి భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సదరు వ్యక్తి కుమారుడితో (5)తో పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు గత వారం రోజులుగా చిన్నారిని పండ్లు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. బాలుడి నోరుమూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లి చిన్నోడిపై లైంగిక దాడికి యత్నించటంతో బాలుడు కేకలు వేశాడు. అప్రమత్తమైన స్థానికులు, కుటుంబ సభ్యులు అతడిని బంధించి దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News