Thursday, December 19, 2024

కుత్బుల్లాపూర్ లో కార్పొరేటర్ వేధింపులు… పారిపోయిన కుమారుడు… తండ్రి హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతం బౌరంపేట్ లో ల్యాండ్ మార్క్ వెంచర్ నిర్వాహకులు, నిజాంపేట్ కార్పొరేటర్ వేధింపులు తాళలేక వెళ్లిపోతున్నా అంటూ లెటర్ రాసి వెళ్లిన రైతు మాధవరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. మాధవరెడ్డి ఇంటి నుండి వెళ్లి పోవడంతో ఆయన తండ్రి మనో వేదనకు గురై హఠాన్మరణం చెందాడు. బుధవారం ఉదయం వరకు బాగానే ఉన్న అతను ఒక్కసారిగా మృతి చెందండంపై కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక వైపు కుమారుడు కనిపించకపోవడంతో మరో వైపు అతడి తండ్రి చనిపోవడంతో గ్రామస్థులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. భూవివాదంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యమే ఇంత వరకు దారి తీసిందని బౌరంపేట్ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూవివాదాల్లో రాజకీయ నాయకులు జోక్యం ఎక్కువగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక రైతులను రాజకీయ నాయకులుు  అంగ, అర్థ బలంతో బెదిరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News