Friday, January 10, 2025

అపార్ట్ మెంట్ పైనుంచి దూకి బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బాచుపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ఓ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అపార్ట్ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సత్య లావణ్య(32) అనే మహిళ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం  అపార్ట్ మెంట్ టెర్రస్ పైనుంచి లావణ్య దూకింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బ్యాంక్ లో పని ఒత్తిడి కారణంగానే లావణ్య ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News