- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వాణి కెమికల్ కంపెనీ ముందు లారీ తగలబడింది. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనే ఆగి ఉన్న మరో హెచ్ఎం డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ సైతం మంటలు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -