Monday, December 23, 2024

పీర్జాదిగూడలో మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లిఖార్జున నగర్ కాలనీలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టడి చూడగా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. వెంటనే మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News