హైదరాబాద్: చేతులు కాళ్లును తాళ్లతో కట్టేసుకున్నాడు. అనంతరం మెడకు ఉరి తాడు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లా తొండూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన శివ కుమార్ రెడ్డి(26) జీడిమెట్లలోని అయోధ్యనగర్‌లో నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి తన రూమ్‌లో లోపల నుంచి గడియ వేసుకున్నాడు. అనంతరం కాళ్లు, చేతులు తాడుతో కట్టుకొని బెడ్ పైనుంచి ఉరి తాడు మెడకు తగలించుకున్నాడు. బెడ్ పైనుంచి కిందకు దూకడంతో అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రాథమిక విచారణలో హత్యేనని భావించారు. శరీరంపై గాయాలు లేకపోవడంతో పాటు గతంలో అతడు రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు తెలిసింది. మూడోసారి ప్లాన్ ప్రకారం అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. శవ పరీక్షలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది.
అందరూ హత్యే అనుకున్నారు కాని అది ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -