Friday, February 21, 2025

కల్లు సేవించి… ప్రాణం తీసిన ఈత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కల్లు సేవించి ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు చనిపోయిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా జిన్నారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన నరేష్(26) అనే యువకుడు తన స్నేహితుడు పల్లపోలు శంకర్(22)లతో కలిసి వావిలాల గ్రామ శివారులో కల్లు తాగడానికి వెళ్లారు. కల్లు సేవించిన అనంతరం పీర్ష చెరువులోకి ఈతకు వెళ్లారు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో నరేష్, శంకర్‌లు మునిగిపోయారు. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి వారి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వాళ్ల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ నాగలక్ష్మి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News