Wednesday, January 29, 2025

మేడిపల్లిలో కన్న కూతురిపై కీచక తండ్రి లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

మేడిపల్లి పోలీసుల అదుపులో నిందితుడు
పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు

మేడిపల్లి: కన్న కూతురిపై లైంగికదాడికి పాల్పడిన కీచకుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన రాచకొండ కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మేడిపల్లిలోని సాయి నగర్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. హస్టల్ లో ఉండి చదువుకుంటున్న తన మైనర్ కూతురును ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో తల్లి లేని సమయంలో బాలికపై బలాత్కారం చేశాడు. అనంతరం జరిగిన విషయం పక్కింటి మహిళకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హజరుపరిచి రిమాండ్ కు తరిలిస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News