Tuesday, April 22, 2025

ప్రేమపెళ్లి… మియాపూర్ లో అత్త, భార్యపై దాడి చేసిన అల్లుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది.  మద్యం మత్తులో భార్య, అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. జనప్రీయ నగర్ లో మహేష్-శ్రీదేవి అనే దంపతులు నివసిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేష్ శ్రీదేవిని ప్రేమ వీవాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. భార్య, అత్తపై పదునైన ఆయుధం దాడి చేశాడు. వెంటనే స్థానికులు గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. శ్రీదేవి అమ్మ మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసియు లో చికిత్స పొందుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. మహేష్ భార్య శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News