- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సూరారంలో లిఫ్ట్ ప్రమాదంలో ఆర్‌ఎంపి వైద్యుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సూరారంలోని శ్రీ సాయి మణికంఠ రెసిడెన్సీలో అక్బర్ పాటిల్ అనే వ్యక్తి ఆర్‌ఎంపి డాక్టర్‌గా వైద్య సేవలు అందిస్తున్నారు. క్రికెట్ బంతి అపార్ట్‌మెంట్ లిఫ్ట్ గుంతలో పడడంతో అక్బర్ తీసేందుకు ప్రయత్నించారు. లిఫ్ట్ గుంతలో తలపెట్టి తీస్తుండగా లిఫ్ట్ అతడిపై పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. లిఫ్ట్‌ను పైకి లాగి మృతిదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -