మేడ్చల్ మల్కాజ్‌గిరి: ప్రియురాలు తన స్నేహితురాలితో ఫోన్‌లో మాట్లాడుతుండగా విన్నాడు. ప్రియురాలి స్నేహితురాలి ఇంట్లో ప్రియుడు దొంగతనం చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా షాపూర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నిరీష, శోభారాణి అనే స్నేహితులు ఈవెంట్ మేనేజర్లుగా పని చేస్తున్నారు. శోభారాణి, నసీర్‌కు మధ్య గత కాలంగా ప్రేమాయణం నడుస్తోంది. నిరీషతో శోభారాణి ఫోన్‌లో మాట్లాడుతుండగా నసీర్ విన్నాడు. ఈ నెల 21న సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లి 23న శోభారాణి తిరిగి వచ్చేసరికి తన ఇంటి డోర్లు తెరిచి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారు ఆభరణాలు, నగదు మాయమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సిసి కెమెరాలు పరీక్షించగా తులసీనగర్‌కు చెందిన నాసర్ అలియాస నసిరుద్దీన్‌గా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే దొంగతనం చేశానని నిజాలు ఒప్పకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫోన్‌లో మాట్లాడింది విని… ప్రియురాలి స్నేహితురాలి ఇంట్లో దొంగతనం చేసిన ప్రియుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -