Friday, December 20, 2024

ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం… యువకుడి పైనుంచి వెళ్లిన బస్సు

- Advertisement -
- Advertisement -

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఉప్పల్ లో బైక్ స్కిడ్ అయి యువకుడు కిందపడిపోయాడు. అతడిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. వర్షిత్ రెడ్డి అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా కిందపడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న బస్సు అతడి పైనుంచి పోవడంతో తీవ్రంగా గాయపడి వర్షిత్ రెడ్డి చనిపోయాడు. తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలు బాదుకొని కన్నీంటిపర్యంతమయ్యారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఫ్లైఓవర్ నిర్మాణంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఫ్లైఓవర్ పనులు చేపటి రెండు-మూడు సంవత్సరాలు గడిచిన ఇంకా పనులు పూర్తి కావడంలేదని మండిపడుతున్నారు. ఫైఓవర్ కోసం తీసిన గుంతలతోనే యువకుడి ప్రాణాలు పోయాయని మృతుడి తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా ఫ్లైఓవర్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఉప్పల్, మేడిపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News