Wednesday, January 22, 2025

కూతురు ఎంబిబిఎస్ చదువొద్దని తల్లి చెరువులో దూకి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుమార్తె ఎంబిబిఎస్ చదువొద్దని తల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ మల్కాజిగిర జిల్లాలోని పోచారంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లాకు చెందిన భాస్కర్(38), లావణ్య(37)లకు 2004లో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమర్తె శ్రీజ(18), కుమారుడు అశ్విత్(14) ఉన్నారు. శ్రీజకు ఎంబిబిఎస్‌లో సీటు రావడంతో పోచారం సద్భావన్ టౌన్‌షిప్‌లో ఉంటున్నారు. కూతురుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, దీంతో ఒత్తిడి తట్టుకోలేదని ఎంబిబిఎస్ చదువడం తల్లికి ఇష్టంలేదు.

ఇదే విషయంలో కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. 25న సదరు కుటుంబం వేములవాడకు వెళ్లి ఇంటికి వచ్చారు. 26న తెల్లవారుజామున లావణ్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోచారం చెరువులో మహిళ మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు లావణ్యదిగా గుర్తించారు. లావణ్యకు కూడా మానసిక స్థితి సరిగా లేదని పోలీసులకు ఆమె భర్త ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News