Thursday, February 20, 2025

మేడ్చల్ పట్టణంలో పట్టపగలు నడిరోడ్డుపై హత్య

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత

మన తెలంగాణ/మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా నరికి చంపారు. కామారెడ్డి జిల్లా మాచ రెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ (25) తన కుటుంబ సభ్యులతో మేడ్చల్ లో నివాసం ఉంటున్నారు. జాతీయ రహదారి నడిరోడ్డు పై ఇద్దరు వ్యక్తులు ఉమేష్ ను కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు. స్థానికులు భయంతో వణికిపోయారు. హత్య చేసిన అనంతరం ఇద్దరు దుండగులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News