Thursday, January 23, 2025

సిలిండర్లలో గంజాయి సరఫరా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోనే మొట్ట మొదటి సారిగా (ప్రత్యేక) వింత పద్దతిలో సిలిండర్లలో గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన నలుగురిని ఎస్ఒటి పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన మేడ్చల్ లోని కుత్బుల్లాపూర్ లో జరిగింది.  ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తుండగా, మేడ్చల్ జాతీయ రహదారి పై తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారి వద్ద నుంచి 65 కిలోల గంజాయి, 2కార్లు, 6 చరవాణిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News