Sunday, January 19, 2025

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లి అక్కడే చనిపోయాడు. మల్కాజిగిరిలోని మారుతీనగర్ రోడ్డు నంబరు 8కు చెందిన ఆశోక్ అనే రైల్వే ఉద్యోగి చిన్న కుమారుడు బాలరేవంత్ ఎంఎస్ చేయడానికి అమెరికాలోని చికాగోకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నాడు. గురువారం రాత్రి అందరూ కలిసి నిద్రపోయారు. మార్నింగ్ స్నేహితులు అతడిని లేపడానికి ప్రయత్నించారు. అతడు అచేతనంగా పడి ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గుండెపోటుతో నిద్రలో మృతి చెంది ఉంటాడని స్నేహితులు భావిస్తున్నారు. రేవంత్ స్నేహితులు అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తన కుమారుడి మృతదేహం హైదరాబాద్‌కు తీసుకరావాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. దీంతో వాళ్ల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని భారత్‌కు తీసుకరావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News