Thursday, December 26, 2024

ఊయలతో ఊపిరి తీసుకున్న తల్లి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: క్షణికావేశంలో ఓ తల్లి ఊయలతో ఉరేసిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మనోజ్-పూజిత(21) అనే దంపతులు ఉప్పల్‌లోని లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె ఇంటి దగ్గరనే ఆన్‌లైన్‌లో టెలీ మార్కెటింగ్ చేస్తోంది. ఆదివారం దంపతులు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఆమె ఆన్ లైన్ జాబ్ కావడంతో ఫోన్‌లో మాట్లాడుతుండగా చిన్నారి ఏడ్చింది. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. భర్త వెంటనే తన ఆఫీస్‌కు వెళ్లాడు. మనస్థాపం చెందిన భార్య గదిలోకి వెళ్లి ఊయలకు కట్టిన చీర తీసుకొని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గది నుంచి పూజిత బయటకు రాకపోవడంతో అమ్మమ్మకు అనుమానం వచ్చింది. స్థానికుల సహాయంతో తలపులు తెరిచి చూడగా ఆమె ఉరేసుకొని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పూజిత స్వస్థలం నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News