- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో నడి రోడ్డుపై డిసిఎం దగ్ధమైంది. బుధవారం ఉదయం నాగోల్ నుంచి సికింద్రాబాద్ వైపు పాత పేపర్ల లోడుతో వెళ్తున్న డిసిఎం ఉప్పల్ చౌరస్తా వద్దకు రాగానే వాహనం క్యాబిన్‌లో మంటల చెలరేగాయి. వెంటనే డ్రైవర్ డిసిఎంను ఆపి బయటకు దూకేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే డిసిఎం పూర్తిగా కాలిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
- Advertisement -