Tuesday, December 24, 2024

తండ్రి మృతి… ఐదో రోజే కుమారుడిని చంపిన తల్లి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: తండ్రి చనిపోయి ఐదు రోజులు అవుతోంది, కుమారుడు మద్యం తాగి సైకో ప్రవర్తిస్తుండడంతో తల్లి అతడిని చీరతో కట్టేయడంతో తనయుడు చనిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకరాం…. రామంతాపూర్‌లోని కామిక్షిపురంలో కోరె శోభ, కుమార్ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు మురళీ అలియాస్ చింటు(30), మనోహర్(20) అనే కుమారులు ఉన్నారు. భర్త కుమార్‌కు బ్రెయిన్ ట్యూమర్ రావడంతో ఏప్రిల్ 8న చనిపోయాడు. శుక్రవారం ఆస్థికలను లంగర్‌హౌస్‌లోని సంఘ్‌మెట్ కలిపి వచ్చారు. అదే రాత్రి మురళీ తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఇంటికి నుంచి బయటకు వచ్చి హంగామా సృష్టించాడు. ఓ వాహనదారుడి మీద పడి భుజం కొరికేందుకు ప్రయత్నించాడు. తల్లి, చిన్న కుమారుడు కలిసి అతడి ఇంటికి తీసుకొచ్చారు. కాళ్లు, చేతులు కట్టేసిన తరువాత అతడు అరుస్తు ఉండడంతో గొంతుకు చీర బిగించి లాగడంతో అతడు మృతి చెందాడు. ఉదయం తన కుమారుడు లేవడం లేదంటూ అందరికీ చెప్పి శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద నాన్న కోరె శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News