Wednesday, January 22, 2025

పరువు నష్టం దావాలో మేధా పాట్కర్ కు ఐదు నెలల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు రూ. 10 లక్షలు చెల్లించాలని ఉత్తర్వు

నర్మద బచావో ఆందోళన్ యాక్టివిస్ట్ మేధా పట్కర్ 2000 నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో న్యాయ పోరాటం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: 23 ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం దావా కేసులో ఢిల్లీ కోర్టు ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పట్కర్ కు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. ఒకప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ అనే లాభేతర సంస్థ అధ్యక్షుడి గా ఉన్న వికె.సక్సేనా ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఆయన నేడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు.

ఆయన పరవుకు భంగం కలిగించినందుకు గాను రూ. 10 లక్షలు పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. కాగా కోర్టు ఆమె జైలు శిక్షను క్రిమినల్ ప్రొసీడర్ కోడ్ 389(3) కింద ఆగస్టు 1 వరకు సస్పెండ్ చేసింది. ఆమె ఈ ఉత్తర్వు మీద అప్పీలు చేసుకోడానికి ఆ వెసలుబాటు కల్పించింది.

పరిశీలన షరతు(ఆన్ కండిషన్ ఆఫ్ ప్రొబేషన్) కింద తనను విడిచిపెట్టాలని ఆమె విన్నవించుకోగా, జడ్జీ ‘‘వయస్సు, నొప్పులు, నష్టాల దృష్ట్యా తీవ్ర శిక్ష విధించాలనుకోవడం లేదు’’ అన్నారు. ఢిల్లీ కోర్టు మే 24న మేధా పాట్కర్ ను ఐపిసి 500 సెక్షన్ కింద దోషిగా తేల్చింది. ఆమెకు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ వేయొచ్చని కోర్టు తేల్చింది.

మేధా పాట్కర్ కు, వికె. సక్సేనా మధ్య న్యాయపోరాటం 2000 నుంచి ఉంది. తన మీద, నర్మద బచావో ఆందోళన్(ఎన్ బిఏ)కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించినందుకుగాను ఆమె దావా వేసింది. ‘ట్రూ ఫేస్ ఆఫ్ ప్యాట్రియట్’ శీర్షికతో పాట్కర్  ఓ పత్రికా ప్రకటన వెలువరిచారు. ఆ ప్రకటన 2000 నవంబర్ 25న వెలువడింది.

కోర్టు ఉత్తర్వు మీద పాట్కర్ స్పందిస్తూ ‘‘నిజం ఎప్పుడు ఓడిపోదు…మేము ఎవరినీ అగౌరవపరచలేదు, మేము కేవలం కష్టిస్తాము…మేము కోర్టు తీర్పును సవాలు చేస్తాం’’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News