Sunday, April 13, 2025

మేధా పాట్కర్ జైలు శిక్ష సడలింపు

- Advertisement -
- Advertisement -

పరువునష్టం కేసులో శిక్ష అనుభవిస్తున్న సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ కు ఢిల్లీ హైకోర్టు సత్ ప్రవర్తనకు గానూ ఆమె జైలు శిక్షను తగ్గించి, విడుదల చేసింది. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న వికె సక్సేనా గుజరాత్ లో ఒక స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహించినప్పుడు దాఖలు చేసిన పరువునష్టం కేసులో మేదా పాట్కర్ ఐదు నెలల జైలు శిక్షఎదుర్కొంటున్నారు. కాగా , మంగళవారం నాడు ఆమెను ఢిల్లీకోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పాట్కర్ లక్షరూపాయల జరిమానా చెల్లించాలనే ముందస్తు షరతు విధించింది.మేధా పాట్కర్ మహిళ, 70 ఏళ్ల వృద్ధురాలు. ఆమెపై గతంలో ఎలాంటి నేరారోపణలు లేవు. ఆమెకు ప్రొబేషన్ పై విడుదల చేయకుండా నిరాకరించడానికి ఎలాంటి కారణాలు లేవని కోర్టు పేర్కొంది. అందువల్ల 2024 జూలై 1న మేధా పాట్కర్ కు కోర్టు విధించిన 5 నెలల సాధారణ జైలు శిక్షను
మెజిస్టీరియల్ కోర్టు సవరించి ఆదేశాలు జారీ చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News