- Advertisement -
న్యూఢిల్లీ : దేశం లోని దర్యాప్తు సంస్థలు జర్నలిస్టులను విచారించేందుకు , వారి నుంచి పత్రాలు, హర్డ్ డిస్క్‌లు, ఫోన్‌లు , ల్యాప్‌టాప్‌లు వంటివి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందించాలని కోరుతూ 15 మీడియా సంస్థలు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశాయి.
జర్నలిస్టులపై ప్రతీకార దాడులు జరగకుండా వారు నిజాలు మాట్లాడగలిగినంత కాలం దేశంలో స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందని పాత్రికేయ సంస్థలు దీనిలో పేర్కొన్నాయి. కొద్ది రోజుల క్రితం న్యూస్‌క్లిక్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పనిచేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో ఢిల్లీ పోలీస్‌లు సోదాలు చేశారు. ఈ సందర్భంగా పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు చేసిన అంశాన్ని లేఖలో ప్రస్తావించాయి.
- Advertisement -