Monday, December 23, 2024

మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: మండలంలోని కాసులపల్లి గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపునకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ అసోసియేషన్ వారు ఆ వో గావో చలే అనేక మంచి నినాదంతో గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యం బాగుండాలని ముందుకు వెళ్లడం ఒక మంచి పరిణామమన్నారు.

ఈ సందర్భంగా పలువురిని పరీక్షించిన వైద్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కా ర్యక్రమంలో డాక్టర్లు వాసుదేవరెడ్డి, రమాకాంత్ , ప్రణీత్, మల్లేశం, రాజు, రాజేందర్, శ్రీకాంత్, రాంమోహన్, కృష్ణారెడ్డి, మైథిలి, ధర్మేందర్, శ్రీ దేవి, మహేందర్, రాజ్ కుమార్, చందు, మ మతలు పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో వెన్నం రవీందర్, పల్లె మధు, బొంకూరి అఖిల్, కొంకటి తిరుపతి, సముద్రా ల రాజ్ కుమార్ గౌడ్, కడమంచి శివ, కుక్క మ నోజ్,గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News