Thursday, December 26, 2024

ప్రతి జిల్లాకు వైద్యకళాశాల: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకే ఏడాదిలో ఎనిమిది వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా హరీష్ రావు శాసన సభలో మాట్లాడారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తిలో వైద్యకళాశాలలు వస్తున్నాయన్నారు. ప్రతపక్ష సభ్యులున్న సంగారెడ్డి, ములుగులోనూ వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 150 వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తోందని, కానీ తెలంగాణకు మాత్రం ఒక్క వైద్య కళాశాలను కూడా మోడీ ప్రభుత్వం ఇవ్వలేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రతి జిల్లాలో నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారామెడికల్ కళాశాలల్లో అనేక కోర్సులు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రతి జిల్లాకు వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక వైద్యకళాశాల్లో సీట్లు మూడింతలు పెరిగాయని హరీష్ రావు తెలియజేశారు. అన్ని ఆస్పత్రుల్లో సిసి కెమెరాలు, బయోమెట్రిక్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News