Sunday, October 27, 2024

కేంద్రం సహకారంతోనే మెడికల్ కళాశాల

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో విద్యాభివృద్ధికి బీజం వేసింది నేనే అని బిజెపి రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలోని బిజెపి కార్యాలయంలో బిజెపి నాయకులతో కలిసి రేవూరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తన కృషి వల్లే నర్సంపేటకు మెడికల్ కళాశాల వచ్చిందని తనను ప్రతిపక్ష నాయకులు ఎవరూ అభినందించడం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నర్సంపేటను విద్యా కేంద్రంగా విలసిల్లెలాలా, రెవెన్యూ డివిజన్ కేంద్రం తీసుకొని ఇచ్చింది తాను అని మూలాలను వదిలిపెట్టి పాలసీ ప్రకారం మెడికల్ కళాశాల ఇస్తే తన కృషి వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.

ఏ రకంగా నిన్ను అభినందించాలో చెప్పాలన్నారు. మెడికల్ కళాశాల పెట్టాలంటే 250 పడకల ఆసుపత్రి ఉండాలని కేంద్ర ప్రభుత్వం 250 పడకల ఆసుపత్రిగా జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా నర్సంపేట ఆసుపత్రిని అభివృద్ధి చేసినందుకే నేడు మెడికల్ కళాశాల రావడానికి దోహదపడిందని, దానికి బీజం వేసింది తానే అని రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలోని నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, నాడు నేను చేసిన అభివృద్ధి వల్లే నేడు అది సాధ్యమైందన్నారు. మార్కెట్ యార్డు, రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, అనేక కార్యాలయాల ఏర్పాటు నాడు చేసిన అభివృద్ధి అన్నారు. నర్సంపేట అభివృద్ధి చెందడానికి బీజం వేసిన నన్ను మొదట మీరు గుర్తించి అభినందించాలని అప్పుడే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారన్నారు. గతంలో మీరిచ్చిన హామీలైన జురాల టూ పాకాల, మిర్చి పరిశోధన కేంద్రం ఏమైందన్నారు. సీడబ్లూసీ ఆమోదం లేకుండా ప్రాజెక్టు చేపట్టకూడదని కనీస అవగాహన లేని ఎమ్మెల్యేవు నీవని నేను పాదయాత్ర చేసిన చేస్తే గోదావరి జలాలు వచ్చాయని, జిల్లా కేంద్రం కావాలని ధర్నా చేశామన్నారు.

సీఎం కేసీఆర్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకునే నీవు జిల్లా కేంద్రం ఎందుకు తీసుకరాలేదన్నారు. మనకంటే తక్కువ మండలాలు ఉన్న ములుగు నియోజకవర్గం జిల్లా అయినపుడు నర్సంపేట జిల్లా ఎందుకు చేయలేదన్నారు. నర్సంపేట జిల్లా కేంద్రం అయి ఉంటే వాతావరణమే మారిపోయేదన్నారు. ధర్మారం నుంచి నర్సంపేట వరకు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామన్నావు.. కనీసం అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పనా చేశారన్నారు.

కుమ్మరి కుంటను మోడల్ ఏరియాగా చేస్తానన్నారు. ఒకసారి బూట్లు లేకుండా కుమ్మరికుంటలోని కాలనీలను తిరిగి రావాలన్నారు. నర్సంపేట బిఆర్‌ఎస్ నేతలతో రియల్ ఎస్టేట్ దందాకు అడ్డగా మారిందన్నారు. కేంద్రం ఇచ్చిన రూ. 66 కోట్ల నిధులతో నర్సంపేట పట్టణం అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ వడ్డెరపల్లి నర్సింహరాములు, పట్టణ అధ్యక్షుడు బాల్నె జగన్, మహబూబాబాద్ పార్లమెంటరీ కోకన్వీనర్ జాటోతు సంతోష్‌నాయక్, గుంటి వీరప్రకాష్, రేసు శ్రీనివాస్, చిలువేరు రజనీభారతి, రాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News