Friday, November 15, 2024

విద్యాసంస్థలపై వైద్యశాఖ ఫోకస్

- Advertisement -
- Advertisement -

వైరస్ విభృంభణ చేయకుండా ప్రత్యేక చర్యలు
ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు
చిన్నారులకు మాస్కులు, తరగతి గదులు నిత్యం శానిటైజేషన్
ప్రతి స్కూళ్లో ఐదు గదులను ఐసోలేషన్‌కు కేటాయించేలా సూచనలు

Medical department focus on educational institutions

నగరంలో ఒమైక్రాన్ భ యంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం కరోనా నిబంధనలు కఠినం చేసి మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరికలు చేసి ఆదిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క మహమ్మారి విద్యాసంస్థలో ఉనికి చాటుతుంది. గత పక్షం రోజుల నుంచి నగరం చుట్టు పక్కల జిల్లాలతో పాటు గ్రేటర్ విద్యాసంస్థ్దల్లో చిన్నారులను భయాందోళనకు గురిచేస్తుంది. మొదట టెక్ మహీంద్ర యూనివర్శిటీతో ప్రారంభమైన తిరుమలగిరిలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలకు వైరస్ సోకడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఎక్కువగా గుంపులు ఉండే స్దలాలు స్కూళ్లు కావడంతో అక్కడ ఒకరికి వైరస్ సంక్రమిస్తే దాని వ్యాప్తి వేగంగా ఉంటుందని అందుకోసం ముందుగా బడుల్లో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాఠశాలలు ఉండే ప్రాంతాలకు చెందిన ఆరోగ్య కార్యకర్తలు నిత్యం బడుల వద్దకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థ్దితులను చూడాలని సూచలను చేశారు. కార్పొరేట్ బడు లు హెల్త్ సిబ్బంది స్కూళ్లో విద్యార్ధులు ఉన్నంతవరకు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పాఠశాల నిర్వాహకులు వి ద్యార్థులంతా ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా చూడటంతో పాటు ప్రధాన ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ మిషన్, మా స్కులు అం దుబాటులో ఉంచి మాస్కులులేని చిన్నారులకు ఇ వ్వాలని, దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేషన్ గదిలో ఉంచాలని, ప్రతి బడిలో ఐదు గదులను ఏర్పాటు చేయాలి. స్కూళ్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, ఇతర సి బ్బంది కరోనా వ్యాక్సిన్ తప్పకుం డా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తే వైరస్ వ్యాపించకుండా చూడవచ్చని, అదే విధంగా తల్లిదండ్రులు కూడా చిన్నారులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టిపెట్టి పోషకాహారం అందించాలని పేర్కొంటున్నారు. చలి ప్రభావంతో జలుబు వచ్చే పరిస్దితి ఉంటుందని వేడినీళ్లతో స్నానం చేయించాలని కోరుతున్నారు. గ్రేటర్ గత వారం రోజుల నుంచి కరోనా పాజిటివ్ కేసులు పరిశీలిస్తే నవంబర్ 27వ తేదీన 66 మందికి సోకగా, 28న 62 మందికి, 29వ తేదీన 70 పాజిటివ్ కేసులు, 30న 78 మందికి, డిసెంబర్ 1వ తేదీన 73 కేసులు, 2వ తేదీన 77 మందికి, 3న 82 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్నారుల పట్ల నిర్లక్షం చేస్తే విద్యాసంస్థలు మూసివేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. నగర ప్రజలు వైరస్ పట్ల అజాగ్రత్తగా ఉంటే థర్డ్‌వేవ్ వచ్చి పాజిటివ్ కేసులు పెరిగే అవకాశముందని, మార్కెట్లు, పెళ్లి కా ర్యాలో గుంపులుగా చేరకుండా భౌతికదూరం పాటించాలని పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News