జాతీయ వైద్యుల సంఘం హెచ్చరికలతో అప్రమత్తం
చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా పాటించాలి
పండగలు, వేడుకలకు దూరంగా ఉండాలంటున్న వైద్యులు
నిలోఫర్, గాంధీలో 25వేల పడకలు సిద్దం చేస్తున్న వైద్యశాఖ
వైద్య సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు
హైదరాబాద్: నగరంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ అనేకమంది బలిగొంది. ఇప్పటికి చేదు గుర్తులు మరువక ముందే థర్డ్‌వేవ్ ఉనికి చాటుకునే అవకాశం ఉందని జాతీయ వైద్యుల సంఘం హెచ్చరిస్తుంది. ఈసారి మహమ్మారి చిన్నారులపై ప్రభావం చూపుతుందని, వాతావరణ పరిస్దితులు, పండగలు, వేడుకల సందర్భంగా పిల్లలను దూరంగా ఉంచాలని సూచించింది. ప్రజలు నిర్లక్షం వహిస్తే కరోనా మూడోసారి వస్తే ఉగ్రరూపం దాల్చి అమయాక ప్రజలను పొట్టబెట్టుకుంటుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజలు పాటించే జాగ్రత్తల బట్టి వైరస్‌ను అదుపులో పెట్టవచ్చని, నిర్లక్షం వహిస్తే ఇతర దేశాల పెరిగినట్లు తమ దగ్గర కూడా కేసులు పెరుగుతాయని పేర్కొంటున్నారు. అందుకోసం జిల్లా వైద్యాధికారులు వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో పడకలు, వైద్యులు, సిబ్బంది, పరికరాలు సిద్దం చేస్తున్నారు.
నగరంలో చిన్నపిల్లల వైద్యానికి పేరుగాంచిన నిలోఫర్‌లో పాత భవనంతో పాటు, ఇన్పోసిన్ భవనం, నాట్కో ఓపి భవనాలపై తాత్కాలిక షెడ్లు వేసి అదనపు పడకలు ఏర్పాటు చేస్తూ 1000 పడకలు ఇప్పటికే సిద్దం చేశారు. మొదటి వేవ్‌లో ఆసుపత్రిలో 850 వైరస్ సోకితే చికిత్స అందించినట్లు, సెకండ్‌వేవ్‌లో 400మంది చిన్నారులకు సోకడంతో మెరుగైన వైద్యం అందించి చిన్నారులందరి కాపాడినట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. వాతావరణ పరిస్దితులు ప్రభావంతో ఎప్పుడైనా వైరస్ వ్యాపించే అవకాశముందని అందుకోసం వైద్యశాఖ నిలోఫర్‌తో పాటు గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల కోసం పడకలు సిద్దం చేస్తున్నట్ల వైద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. నిలోఫర్ ఆసుపత్రిని పీడియాట్రిక్ కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రభుత్వం ప్రకటించి నాణ్యమైన వైద్యం చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిలోఫర్‌లో 12 పిడియాట్రిక్ యూనిట్లు, 4 జనరల్ సర్జరీ, 3 గైనకాలజీ, 2 నియోటాలజీ యూనిట్లు ఉన్నాయి.
ఓల్డ్ బిల్డింగ్‌లో రాజీవ్‌శ్రీ కేర్ సెంటర్‌లో 10 కెఎల్ సామర్దం ఉన్న రెండు అక్సిజన్ ట్యాంకర్లు, ప్రస్తుత పడకలు ఈసదుపాయాలు సరిపోతాయని, అదనపు పడకలు కోసం కొత్తగా అక్సిజన్ పైపులైన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనడంతో వాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్నారులను వైరస్ ఎటాక్ట్ చేస్తే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి థర్డ్‌వేవ్ ఎదుర్కొని నగర ఆసుపత్రులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చేస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు టీకా 18ఏళ్లపైబడినా వారికే వచ్చిందని, చిన్నారులకు సంబంధించిన మెడిసిన్ అందుబాటులో లేవని, అందుకోసం వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా తల్లిదండ్రులు చిన్నారుల పట్ల జాగ్రత్తలు పాటించి గుంపులుగా ఉండే ప్రదేశాల్లో ఉండకుండా చూడాలని, విందులు, వినోదాలకు దూరంగా ఉండి వైద్యులు సలహాలు పాటించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.