Sunday, April 6, 2025

సిఎం కెసిఆర్ కు ముగిసిన వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

Medical examinations completed for CM KCR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ వైద్య పరీక్షలు ముగిశాయి. స్వల్ప అస్వస్థతతో సిఎం యశోద ఆస్పత్రి వెళ్లారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు వెల్లడిస్తూ.. రెండ్రోజులుగా అలసిపోయినట్టు సిఎం కెసిఆర్ చెప్పారు. ఎడమ చేయి నొప్పి ఉందన్నారు. కెసిఆర్ సర్వైకల్ స్ప్రెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. నరంపై ఒత్తిడి పడి కెసిఆర్ కు చేయినొప్పి వచ్చిందని చెప్పారు. పర్యటన, ఉపాన్యాసాలు చేయడం వల్ల నీరసంగా ఉన్నారు. సిఎం కెసిఆర్ కు గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవు. గుండె పనితీరు బాగానే ఉందని పరీక్షల్లో తేలింది. యాంజియోగ్రామ్ నిర్వహిస్తే బ్లాక్ లు లేవని తేలింది. కెసిఆర్ కు బిపి, షుగర్ సాధారణంగా ఉంది. రక్త పరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలు లేవు. వైద్య పరీక్షల తర్వాత 3-4 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూపించామని వైద్యులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News