Thursday, December 26, 2024

థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు వైద్యశాఖ చర్యలు

- Advertisement -
- Advertisement -
Medical measures to combat the third wave
06 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలకు అక్సిజన్ సౌకర్యం
గతంలో ఏర్పాటు చేసిన 10 ఐసోలేషన్ కేంద్రాలు పునరుద్దరణ
నగరంలో రోజుకు 40వేలమందికి కరోనా టెస్టులు చేసేలా ఏర్పాట్లు
అదనంగా వైద్య సిబ్బంది, మాస్కులు, అంబులెన్స్ సిద్దం చేస్తున్న వైద్యశాఖ

హైదరాబాద్: నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో థర్డ్‌వేవ్ ప్రారంభమైందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. నెల రోజుల పాటు ఈప్రభావం ఉంటుందని ప్రజలు ఆందోళన చెందకుండా కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచిస్తున్నారు. అదే విధంగా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. నగర పరిధిలోని 06 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 792 అక్సిజన్ బెడ్లుకు సౌకర్యం కల్పించడంతో పాటుగా అదనంగా వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు, మాస్కులు, శానిటైజర్లు సిద్దం చేస్తున్నారు. మొదటి, సెకండ్ వేవ్‌లో ఏర్పాటు చేసిన 10 ఐసోలేషన్ సెంటర్లు పునరుద్దరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ప్రతి రోజు 40వేలు టెస్టులు చేసేందుకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలతో పాటు మొబైల్ వాహనాలు, టీమ్‌లతో ర్యాండమ్‌గా క్యాంపులు నిర్వహించనున్నట్ల వైద్యులు వెల్లస్తున్నారు. మార్కెట్లు, పాఠశాలలు, కళాశాలలువంటి సంచారం ఉండే ప్రాంతాల్లో టెస్టుల సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వీటిలో 85శాతం యాంటీజెన్లు, 15శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని కిట్లు కొనుగోలు చేసినట్లు, ప్రస్తుతం చేస్తున్నటెస్టుల్లో బయటపడుతున్న కరోనా బాధితుల్లో 90శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. థర్డ్‌వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్దితుల్లో బయటకు రావాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

పెళ్లిళ్లు, విందులు వాయిదా వేసుకోవాలని, సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, బంధువులతో అట్టహాసంగా చేస్తే మహమ్మారి రెక్కలు కట్టుకుంటుందని చెబుతున్నారు. అదే విధంగా రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించవద్దని, పండగ వేళ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చేవారికి కూడా దూరంగా ఉండాలని, ఫిబ్రవరి నెలాఖరు వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో పాజిటివ్ కేసులు వెయ్యి దాటింది. మరో 15 రోజుల వరకు కేసుల సంఖ్య కొనసాగే అవకాశముంటుందని జిల్లా వైద్యశాఖ భావిస్తుంది. నూతన వేడుకల నుంచే వైరస్ తీవ్రరూపం దాల్చిందని, వచ్చే పండగ వరకు ఈపరిస్దితులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News