Monday, December 23, 2024

తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో వైద్య విప్లవం కొనసాగుతోందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత 26 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, ఈ కాలేజీల్లో తెలంగాణ విద్యార్థులకే సీట్లు కేటాయిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని హరీష్ రావు ప్రశంసించారు. ఒకేసారి 852 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. కొత్త కాలేజీలకు ప్రభుత్వం జివొ ఇచ్చిందన్నారు. పల్లె, బస్తీ దవాఖానాల్లోనూ నియామకాలు చేపట్టామని, తెలంగాణలో కొత్త మెడికల్ కాలేజీలతో అదనపు సీట్లు వస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపడుతామని వివరణ ఇచ్చారు. వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చామన్నారు.

Also Read: మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News