Thursday, January 23, 2025

వైద్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు: డిహెచ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు సెలవుల రద్దు చేస్తూ ప్రజారోగ్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం అన్ని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులకు అయన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించారు. ఇంకా ఎవరైనా ఉద్యోగులు సెలవులో ఉంటే వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఉద్యోగులు తప్పకుండా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండి విధులు నిర్వహిస్తూ ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఉన్నతాధికారులు ఆదేశాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News