Thursday, January 23, 2025

ఖమ్మంలో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

ఖమ్మంలో డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య

మన తెలంగాణ/ఖమ్మం: తెలంగాణలో మరో మెడికో ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్స్ చదువున్న సముద్రాల మానస అనే విద్యార్థిని ఆదివారం హాస్టల్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకొని బలవన్మరణం చెందింది. వరంగల్ జిల్లాకు చెందిన మానస మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్స్ నాలుగో సంవత్సరం చదువుతూ కళాశాలకు సమీపంలోని మధుర నగర్లో ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది ఆదివారం సాయంత్రం హాస్టల్లోని నాలుగో అంతస్తులో తన తన గది నుంచి బయటికి వచ్చి బాల్కనీలో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు నిప్పు అంటించుకొని ఆత్మహత్య పాల్పడింది.

Also Read: రాష్ట్రంలో విద్యుత్ ధగ ధగలు..

అప్పటివరకు స్నేహితులతో ముచ్చటించిన మానస ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు ఆందోళన చెందారు.  విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఆమె భౌతికయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానస ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు ఆమె గది నుండి ఆమె సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఖానాపురం హవేలీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో వేధింపులు భరించలేక వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News