Monday, December 23, 2024

పురుషాంగాన్ని కోసుకొని వైద్య విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: అనుమానాస్పద స్థితిలో ఓ ఎంబిబిఎస్ విద్యార్థి ఇంట్లో పురుషాంగం కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామ జిల్లా దేవరుప్పలకు చెందిన కరుణ కుటుంబం నగరానికి 20 సంవత్సరాల క్రితం వలస వచ్చారు. భర్త తాగుడుకు బానిస అయ్యి 10 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్ల్లిపోయాడు. అప్పటి నుంచి కుమార్తెతో పాటు కుమారుడు దీక్షిత్ (21) ఉంటుంది. నగరంలో దొరికిన పని చేసుకుంటూ తల్లి చదివించింది.

కుమార్తె ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు సికింద్రాబాద్ గాంధీ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదుతున్నాడు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న దీక్షిత్ డిప్రెషన్‌కు లోనుఅయ్యినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ దివారం ఇంట్లో ఒంటరిగా దీక్షిత్ పురుషాంగం కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంత సేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గదికి వెళ్లి చూడగా దీక్షిత్ రక్తపు మడుగులో పడి కనిపించాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడు అనారోగ్య సమస్యతో ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News