హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో వైద్యవిద్యార్థి మృతిచెందిన సంఘటన నగరంలోని మెహిదీపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. కాప్రాకు చెందిన రాంగోపాల్ కుమారుడు సిహెచ్ విశ్వకళ్యాణ్(25) నగరంలో ఎంబిబిఎస్ పూర్తి చేసి కార్వాన్‌లో ఉంటూ పిజి ఎంట్రెన్స్ కోసం చదువుతున్నాడు. అమీర్‌పేటలోని తన స్నేహితుడిని కలిసి శనివారం అర్ధరాత్రి ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సమీపంలోకి రాగానే టిప్పర్ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ సంఘటనలో విశ్వకళ్యాణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హుమాయున్ నగర్ పోలీసులు బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -