Sunday, January 19, 2025

ఫిలిప్పీన్స్‌లో పటాన్‌చెరు వైద్య విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

వైద్య విద్య చదువు కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ (19) ఫిలిప్పీన్స్‌లోని పెర్చక్యువెల్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. త్వరలో మెడిసిన్ మూడవ సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలోనే చనువు చాలించింది. గురువారం రాత్రి చింత స్నిగ్ధ తన గదిలో నిద్రపోయింది. ఉదయం పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు స్నేహితులు ఆమె గది వద్దకు వెళ్లి పిలిచారు.

కానీ గది తలుపులు ఎంతకూ తీయకపోవడంతో ఇండియాలోని ఆమె తండ్రికి ఫోన్ చేశారు. దాంతో విద్యుత్ శాఖలో డిఇగా పనిచేస్తున్న ఆమె తండ్రి అమృతరావు గది తలుపులు పగులగొట్టాలని సూచించడంతో వారు గది తలుపుల పగులగొట్టి చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. కూతురు ఉన్నత విద్య కోసం వెళ్లి, తిరిగి వస్తుందన్న ఆశతో ఉన్న తల్లిదండ్రులు ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు మృతదేహాన్ని ఇండియాకు రప్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News