Saturday, December 28, 2024

హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో చోటుచేసుకుంది.

అమరావతి: వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన ఘటన సత్యసాయి జిల్లాలోని హిందూపురంలో చోటుచేసుకుంది. చిక్ బళ్లాపూర్ మెడికల్ కాలేజీలో పిజి చదువుతున్న అక్షిత, సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరుకు చెందిన తన స్నేహితుడితో కలిసి నిన్న ఉదయం లాడ్జికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పోలీసులు అక్షిత స్నేహితుడు మహేష్ వర్మను అదుపులోకి తీసుకున్నాడు.మహేష్ వర్మ హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

 Medical Student Suspicious dies in Hindupur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News