గోషామహల్: తీర్దయాత్ర నిమిత్తం హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిన ఉస్మానియా బో ధనాసుపత్రికి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు గ ల్లంతయ్యారు. వైద్య ఆరోగ్య మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో అధికారులు గల్లంతైన వైద్య విద్యార్థుల ఆచూకీని కనుక్కుని, వారంతా మనాలీలో క్షేమం గా ఉన్నట్లు సమాచారం అందించడంతో వైద్యవర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. పీజీ వైద్య విద్యార్థులు శ్రీనివాస్, బానోత్ కమల్ లాల్, రోహిత్ సూరి త దితరులు ఉస్మానియా ఆసుపత్రిలో ఇటీవలే తృతీయ సంవత్సరం వైద్య విద్యను పూర్తి చేసి, తీర్దయాత్రం నిమిత్తం ఇటీవల హిమాచల్ ప్రదేశ్ మీదుగా అ మర్‌నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడ ప్రతికూల వాతావరణ పరిస్థితులతో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కులూ మనాలీతో వరదల భీబత్సంలో చిక్కుకున్నా రు.
ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థుల ఆచూకీ గల్లంతు కావడంతో అక్కడి ప్రభుత్వం ఢిల్లీలోని రెసిడెంట్ కార్యాలయానికి సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రి వైద్యాధికారులు, పూర్వ విద్యార్థులు, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ జూని యర్ వైద్యుల సంఘం ప్రతినిధులు గల్లంతైన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థుల ఆచూకీతో పాటు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించడంలో నిమగ్నమ య్యారు. గల్లంతైన వైద్య విద్యారుల విజయంపై వెంటనే స్పందించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్‌రావు గల్లంతైన ఉస్మానియా వైద్య విద్యా ర్థులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడైనా చిక్కుకున్నారా? తదితర వివరాలను వెంటను తెలుసుకుని, వారికి సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు అవసరమైన చ ర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు.
మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో అధికారులు వైద్య విద్యార్థుల ఆచూకీ తెలుసుకున్నారని, వారంతా మనాలీలో సురక్షితంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా అధికారులు మంత్రి హరీష్‌రావుకు తెలియజేసినట్లు ఆయన వెల్లడించారు. దీంతో వైద్య విద్యార్థులకు క్షేమంగా హైదరాబాద్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారు లకు సూచించినట్లు తెలిపారు. కాగా తీర్దయాత్రకు వెళ్లిన ఉస్మానియా బోధనాసుపత్రి పీజీ వైద్య విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు అందిన సమాచారం తో వైద్య వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.