ఎఫ్‌ఎంజీ రాసేందుకు అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. 30 జూన్ 2022లోపు, అంతకు ముందు కోర్సు పూర్తి చేసిన విద్యార్థులను ఎఫ్‌ఎంజి (ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ హోమినేషన్) హాజరుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జూన్ 30కు ముందు వారి సంబంధిత ఇన్సిట్యూట్ ద్వారా కోర్సు, డిగ్రీని పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ కలిగి ఉన్న విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ రాసేందుకు అనుమతి ఉంటుందని తెలిపింది. కొవిడ్- 19 మహమ్మారితో పాటు, ఉక్రెయిన్-, రష్యా యుద్ధంతో విదేశీ వైద్య కళాశాలల్లో చేరిన అనేక మంది భారతీయ వైద్య విద్యార్థులు తిరిగి స్వదేశానికి వచ్చేశారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కళా శాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జా మినేషన్‌కు అనుమతి ఇస్తూ తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలో, ఉత్తీర్ణత సాధించిన వారు భారత్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.