Monday, December 23, 2024

చంద్రబాబుకు వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన చంద్రబాబు, బుధవారం హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ఏఐజి ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం, వెంటనే చంద్రబాబును కలిసి, ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది. చంద్రబాబు చెప్పిన వివరాలను బట్టి, ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవలసిందిగా వైద్య బృందం సలహా ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉదయం చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News