Sunday, December 22, 2024

ఆస్పత్రిలో మమతకు వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రిలో శనివారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ఆమె ఎడమకాలికి, కుడిభుజానికి గాయాలయ్యాయి. రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చానని, వైద్యులు పూర్తిగా పరీక్షలు చేసారని చెప్పారు. కుడి భుజానికి సర్జరీ జరిగిందా అని మీడియా అడిగినప్పుడు అదేమంత సీరియస్ కాదని, ఆందోళన పడవద్దని చెప్పారు. ఇప్పుడు ఇబ్బందేమీ లేదని , రోజూ 20,000 అడుగులు నడక సాగిస్తున్నానని తెలిపారు. ఆస్పత్రిలో మూడు గంటల సేపు పరీక్షలు జరిగిన తరువాత బయలుదేరుతూఏ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News