Wednesday, November 20, 2024

పైసా ఖర్చు లేకుండా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 134 రకాల ఉచి త వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ డయా గ్నస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా శనివారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌గా ప్రారంభించారు. అన్ని జిల్లాల నుం చి పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వైద్యాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నస్టిక్స్ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను అందుబాటులోకి వచ్చా యి. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఇప్ప టివరకు 54 పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, తాజాగా కొత్త పరీక్షలతో కలిపి 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొ చ్చామని అన్నారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్‌కు పంపిస్తామని చెప్పారు. కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్ ల్యాబ్‌ల్లో రూ.500 నుంచి రూ.10వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కో రేడియాలజీ, పాథాలజీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.4.39 కోట్లు ఖర్చు చేస్తున్నదని, 134 పరీక్షలు నిర్వహించేందుకు మరో రూ.1.70 కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. అంటే ఒక్కో హబ్ ఏర్పాటుకు రూ.6.09 కోట్ల వ్యయం కానున్నదని వెల్లడిచారు. గతంలో ఒక్కో ల్యాబ్‌ల నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు కాగా, ఇప్పుడు అదనంగా మరో రూ.60 లక్షల భారం పడనున్నదని, మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లు వెచ్చించనున్నదని చెప్పారు. సెంట్రల్ ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు అత్యుత్తమంగా పాటిస్తున్నారని, ఇప్పటికే ఎన్‌ఎబిఎల్ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పారు.

13 జిల్లా ల్యాబ్‌లకు ఎన్‌ఎబిఎల్ ప్రాథమిక అక్రిడిటేషన్ సాధించాయని అన్నారు. ఇప్పటివరకు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించారని, 57.68 లక్షల మంది రోగులు ప్రయోజనం పొందారని చెప్పారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చాలా కష్టపడ్డారని కొనియాడారు. వైద్యులు మెరుగైన సేవలు అందించడం వలన ఆరోగ్య తెలంగాణ దిశగా వెళ్లుతున్నామని అన్నారు. తెలంగాణ వైద్యులు అద్భుతంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కెసిఆర్ కిట్, గర్భిణులకు కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తోందని వివరించారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే.. ఇప్పుడు 70 శాతం జరుగుతున్నాయని అన్నారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని,నిమ్స్ అసూపత్రిలో రోబొటిక్ మెషిన్‌ని కూడా ప్రారంభిస్తామని హరీశ్‌రావు వెల్లడించారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News