Wednesday, January 22, 2025

సూది గుచ్చకుండానే వైద్య పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారించే నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. బయో ఏషియా సదస్సులో ఎగ్జిబిషన్‌లో ఈ సాంకేతిక పరికరాన్ని ప్రదర్శించారు. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని ఆర్కా ల్యాబ్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డివైజ్ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.

నిలబడిన చోటే ముఖ కవళికలను కెమెరా రికార్డు చేసి వాటిని ఎనలైజ్ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్ సాయంతో బిపి, షుగర్, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కిమ్స్‌తోపాటు మరికొన్ని సెంటర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్లినిక్‌ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 4వేల మందికి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వైద్య పరీక్షలు చేయగా 91 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నూతన డివైజ్ ద్వారా వ్యాధి నిర్ధారణ ఖర్చు భారీగా తగ్గుతుందని, రూ.150 లోపే హెల్త్ రిపోర్టు పొందవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News