మీరు మందుల ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారా?..అయితే ఈ వార్త మీకు ఊరటనిస్తుంది. అదేంటంటే?..ప్రభుత్వం కొన్ని అవసరమైన మందుల రేట్లను తగ్గించింది. చెవి, గుండె, షుగర్ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు ఇప్పుడు తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. వీటన్నింటితో పాటు మల్టీవిటమిన్ మందులు కూడా తక్కువ ధరలకు ప్రజలకు అందుతాయి. దీని గురించి పూర్తిగా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఇటీవల నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) సమావేశం నిర్వహించింది. ఈ సమయంలో ఔషధాల ధరలను తగ్గించడం గురించి సమావేశంలో చర్చ జరిగింది. కాగా, దానిపై ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో 54 అవసరమైన మందులతో పాటు, NPPA 8 ప్రత్యేక మందుల ధరలను కూడా తగ్గించారు. వీటిలో గుండె, యాంటీబయాటిక్స్, మల్టీ విటమిన్లు, విటమిన్ D, చెవి, మధుమేహం ఇలా అనేక ఇతర మందులు ఉన్నాయి.
అయితే, ఔషధాల ధరలను ప్రభుత్వం గత నెలలో అంటే మేలో కూడా తగ్గించిన విషయం తెలిసిందే. అప్పట్లో 41 నిత్యావసర మందులు, 6 ప్రత్యేక మందుల ధరలను తగ్గించారు. వీటిలో అసిడిటీ, గ్యాస్, పెయిన్ కిల్లర్, ఎలర్జీ, కాలేయానికి సంబంధించిన మందులు ఉన్నాయి. ఇవే కాకుండా మధుమేహం మందులు, యాంటీబయాటిక్స్, మల్టీ విటమిన్లు కూడా ఉన్నాయి.
నిత్యావసర మందుల ధరలను తగ్గించడం వల్ల సామాన్యుల జేబులపై భారం తగ్గే అవకాశం ఉంది. గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య దేశంలో చాలా ఎక్కువగా ఉంది. గణాంకాలను విశ్వసిస్తే..భారతదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. వారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ప్రతిరోజూ మందులు తీసుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో మధుమేహ రోగులు మందుల ధరలను తగ్గించడం ద్వారా చాలా ప్రయోజనం పొందవచ్చు.