Monday, December 23, 2024

ప్రభుత్వ ఆస్పత్రులకు చేరాల్సిన మందులు గోడౌన్లో దొరికాయి!

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు చెందిన ఔషధ నియంత్రణ అధికారులు జరిపిన దాడుల్లో లక్షల విలువ చేసే ఔషధాలు లభ్యమయ్యాయి. వీటిపై ‘ప్రభుత్వం సరఫరా చేసే మందులు’ అనే ముద్ర ఉండటం విశేషం. వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే నిమిత్తం సిద్దమైన ఈ మందులను అధికారులు ఒక అనధికార గోడౌన్ లో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 20.52 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

తమకు అందిన సమాచారం మేరకు ఔషధ నియంత్రణ విభాగం అధికారులు జనవరి 18,19 తేదీల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లోని ఆజాద్ నగర్ లో అలీ కేఫ్ సమీపాన ఒక గోడౌన్ లో భారీయెత్తున నిల్వ చేసిన ఔషధాలను వారు స్వాధీనం చేసుకున్నారు. యజమాని మహమ్మద్ బషీర్ అహ్మద్ నిర్వహిస్తున్న ఈ గోడౌన్ కు లైసెన్స్ లేకపోవడం గమనార్హం.

అధికారులు స్వాధీనం చేసుకున్న ఔషధాల్లో యాంటిబయోటిక్స్, చిన్నపిల్లలకు ఇచ్చే సిరప్పులు, యాంటీ అల్పర్ మందులు, యాంటి బయోటిక్ ఇంజెక్షన్లు, మలేరియా నివారణకు వాడే మందులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ చేయాల్సిన మందులు ఇలా దారితప్పి ప్రైవేటు గోడౌన్ కు చేరడాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు గోడౌన్ యజమాని బషీర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ మందులను బషీర్ వివిధ దుకాణాలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News