Friday, December 27, 2024

వ్యాపారంగా మారిన వైద్యం

- Advertisement -
- Advertisement -
  • నకిలీ మందులతో రోగులకు ప్రాణగండం
  • తూతూ మంత్రంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా అధికారుల చర్యలు
  • మాముళ్ల మత్తులో అధికారులు
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం

నారాయఖేడ్: కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందజేస్తున్నామని సిఎం కెసిఆర్ సర్కారు, మంత్రి హరీశ్‌రావు తెలుపుతూ ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందజేస్తున్నప్పటికీ ఖేడ్‌తో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోజుకో ఆసుపత్రి పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పిఎంపి, ఆర్‌ఎంపితోపాటు తదితర వైద్యులు కొందరూ అచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరూ విద్యావంతులు శాస్త్రీయంగా వైద్యంచేస్తున్నప్పటికీ మరి కొందరూ మాత్రం గుడ్డి వైద్యం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. దీనికి తోడు కొన్ని ఆసుపత్రులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ ఆవరణలో కొన్ని మెడికల్ షాప్‌లను నిర్వహించి నాసిరకమైన మందులను విక్రయిస్తున్నారు.

అంతేకాక వైద్యులు సైతం మెడికల్ షాప్‌ల కొందరూ యజమానుల వద్ద పర్సంటేజిలకు లాలూచి పడి నకిలీ మందులనే డాక్టర్ ప్రిస్‌క్రిప్షన్ ఇవ్వడంతో తప్పని పరిస్థితుల్లో నకిలీ మందులను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తతంగం ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న ఖేడ్ నియోజకవర్గంలో మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొందరూ రాజకీయ అండ బలంతో ఇష్టానుసారంగా వైద్యశాలలను కొనసాగిస్తూ అమాయకమైన రోగుల వద్ద నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే ఎదురించి, బెదిరింపులకు గురిచేస్తున్న దాఖలాలు అనేకంగా ఉన్నాయి.

కాగా అమాయక రోగుల అవసరాలను ఆసరాగా చేసుకొని నియోజకవర్గం కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఖేడ్ నియోజకవర్గంలో రోజురోజుకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తున్నప్పటికీ ప్రభుత్వ వైద్యాన్ని కొందరూ మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ప్రజల్లో ఏళ్ల తరబడిగా కొందరూ ప్రైవేట్ వైద్యులను నమ్మి మోసపోతున్నారన్న దాఖలాలు అనేకంగా ఉన్నాయి. కాగా ఖేడ్ ఏరియా ఆసుపత్రిలో ఆధునిక మెరుగైన వైద్యాన్ని వినియోగించుకొని ప్రజలు నష్టపోకుండా చూడడంతో పాటు రోగులను పీడిస్తున్న ప్రైవేట్ వైద్యులు, నకిలీ మందులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలిని నియోజకవర్గ ప్రజలు, కొందరు వైద్య నిపుణులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News