- Advertisement -
న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజువారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్లుపీఐ) లో 10.7 శాతం సవరించినట్టు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌పీపీఎ) ప్రకటించింది. జ్వరం, ఇన్‌ఫెక్షన్స్, గుండెజబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు పెరగనున్నాయి. పారాసిటమాల్, ఫెనోబర్బిటోన్, అజితోమైసిన్, సిప్రాన్, హైడ్రోక్లోరైడ్, మైట్రిండజోల్ వంటి మందుల ధరలు భారం కానున్నాయి.
- Advertisement -