Wednesday, January 22, 2025

మెడికో లాస్యది ఆత్మహత్యాయత్నం కాదు

- Advertisement -
- Advertisement -

వరంగల్ ఎంజిఎం : వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం (పిడియాట్రిక్ డిపార్ట్‌మెంట్) ఎంజిఎం పిల్లల విభాగంలో వైద్య విద్యార్థినిగా విధులు నిర్వహిస్తున్న లాస్య నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కెఎంసి ప్రి న్సిపాల్ డా.మోహన్‌దాస్ శనివారం వివరణ ఇచ్చా రు. విద్యార్థిని స్వస్థలం హైదరాబాద్ అని, ఉదయం 8 గంటల సమయంలో

తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పి రావడం వలన నొప్పి తీవ్రత తగ్గించుకోవడానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ వేసుకోవడం జరిగిందని లా స్య తెలిపిందని, అయినా తలనొప్పి తగ్గకపోయేసరికి మరొక టాబ్లెట్ మోతాదు పెంచి వేసుకుందన్నారు. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత వాంతులు కావడంతో ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లాస్య చికిత్స తీసుకున్నట్లు లాస్య యొక్క వైటల్స్ స్టేబుల్‌గా ఉన్నట్లు డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాల పిజీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని కోరారు.
లాస్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థిని లాస్యకు ప్రస్తుతం ఎంజిఎం ఆర్‌ఐసియూ విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న లాస్య ఎంజిఎం ఆసుపత్రికి రావడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం లాస్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News