Monday, December 23, 2024

డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు… హెచ్‌ఒడిపై బదిలీ వేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా సీనియర్ వేధింపులపై ప్రీతి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యహరించిన కాకతీయ మెడికల్ కాలేజ్ హెచ్‌ఒడి నాగార్జునరెడ్డిపై వైద్య ఆరోగ్య శాఖ వేటు వేసింది. ఆయనను కెఎంసి నుంచి భూపాలపల్లికి బదిలీ చేస్తున్నట్లు గురు వారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. నిజ నిర్దారణ కమిటీ రిపోర్టులో నాగార్జునరెడ్డి పర్యవేక్షణ లేకపోవడమే ఇద్దరి వైద్య విద్యార్థుల మధ్య వైరుద్యం పెరగడానికి కారణంగా తెలుస్తోంది.

ఈ మేరకు నాగార్జునరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం వెలువడినట్లుగా సమాచారం. ప్రీతి కుటుంబ సభ్యులు, వివిధ ప్రజా సంఘాలు హెచ్‌ఒడి నాగార్జునరెడ్డి తప్పిదంపైనే మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. నాగార్జునరెడ్డితో పాటు కెఎంసి ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాస్, ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనస్థీషియా హెచ్‌ఒడి నాగార్జునరెడ్డి ఒక్కరిపై మాత్రం బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

దర్యాప్తు ముమ్మరం..
ప్రీతి ఆత్మహత్య ఘటన కేసుపై వరంగల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు వారాలపాటు ఖమ్మం సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న నిందితుడు డాక్టర్ సైఫ్ ను నాలుగురోజులపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ వరంగల్ కోర్టు ఆదేశించింది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News